గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి


నెల్లూరు : జిల్లాలో గర్భిణులకు మెరుగైన వైద్యసేవలందించాలని వైద్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జయశ్రీ ఆదేశించారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వైద్యాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్డాడారు. ప్రధానమంత్రి మాతృత్వ యోజన కార్యక్రమం క్రింద ప్రతినెలా 9వ తేదీన గర్భిణులకు అన్ని రకాల వైద్యపరీక్షలు చేయాలన్నారు. ప్రధానంగా లింగనిర్ధారణ పరీక్షలపై దృష్టిపెట్టాలన్నారు.

 

పీసీపీఎన్‌డీటీ చట్టంపై గర్భిణులకు కూడా అవగాహన కల్సించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 56 ఆరోగ్య ఉపకేంద్రాలను మొదటి విడత కింద సబ్‌సెంటర్‌లుగా మార్పుచేస్తున్నామని తెలిపారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు సకాలంలో వైద్య సేవలందించేలా వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. సీజనల్‌ వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీఎంహెచ్‌వో డాక్టర్‌ స్వర్ణలత, జిల్లా క్షయనివారణ అధికారి డాక్టర్‌ వెంకటప్రసాద్‌, డీఐవో డాక్టర్‌ శెలీనాకుమారి, డాక్టర్‌ లక్ష్మి, డీఎంవో మనోరమ, ఎపిడమాలజిస్ట్‌ డాక్టర్‌ వీరప్రతాప్‌, పీవోడీటీటీ డాక్టర్‌ ఉమామహేశ్వరి, డెమో శ్రీనివాసులు, ధరేంద్ర పాల్గొన్నారు.