బొమ్మలరామారం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మిషన్ ఇంద్రధనస్సు కార్యక్షికమాన్ని విజయవంతం చేయాలని ఎంపీపీ చిమ్ముల సుధీర్‌డ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంవూదంలో మిషన్ ఇంద్రధనస్సు, చిన్న పిల్లల టీకా కార్యక్షికమంపై ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్షికమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. వచ్చే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో మొదటి వారంలో జరుగబోయే మిషన్ ఇంద్రధనస్సు కార్యక్షికమంలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లోని చిన్నపిల్లలకు టీకాలను సకాలంలో అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు.
గ్రామాల్లో దవాఖాన సిబ్బంది అందుబాటులో ఉండి పిల్లలకు సేవలు అందించాలని కోరారు. పిల్లల ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. టీకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం దవాఖానలో రోగులకు అందించే మందులను పరిశీలించారు. కార్యక్షికమంలో మండల వైద్యాధికారి శ్రవణ్‌కుమార్, జీఎన్‌ఎం, ఏఎన్‌ఎంలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.