ఇక.. డిజిటల్‌ ఆరోగ్య సేవలు




  • రెనోవా ఆస్పత్రి యాప్‌ను ప్రారంభించిన ఎండీ



లంగర్‌హౌజ్‌ : ఆరోగ్య సేవలను డిజిటలైజేషన్‌ చేసేందుకు రెనోవా గ్రూప్‌ ఆఫ్‌ ఆస్పత్రి ముందుకు వచ్చింది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన రెనోవా ఆస్పత్రి యాప్‌ను శుక్రవారం ఆస్పత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌ పి. శ్రీధర్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో సేవలు అందించడంలో రెనోవా ఆస్పత్రి ముందుందని చెప్పారు. పేషెంట్‌కు మరింత మెరుగైన సేవలు అందించడానికి హెల్త్‌ సైన్స్‌ 360 డిగ్రీల డిజిటల్‌ హెల్త్‌ కేర్‌ సేవలను అందించే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. హైదరాబాద్‌లోనే మొదటిసారిగా శివారు ప్రాంతాల రోగులకు పూర్తిగా డిజిటల్‌ రూపంలో ఆరోగ్య సేవలు అందించే ఆస్పత్రిగా రూపాంతరం చెందిందన్నారు.

 

రోగులకు ఎటువంటి ఇబ్బందులు, ఆటంకాలు లేని నిరంతర వైద్య సేవలను అందించే లక్ష్యంగా సేవలందిస్తున్నామని ఆయన తెలిపారు. మొట్టమొదట రెనోవా ఆస్పత్రి లంగర్‌హౌజ్‌లో ఈ యాప్‌ సేవలను ప్రారంభించామని ఆయన అన్నారు. నగర శివారు ప్రాంతంలో తాము అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ యాప్‌ ద్వారా వైద్యుల అపాయింట్‌మెంట్‌, మందుల చిట్టీలు, ల్యాబ్‌ రిపోర్టులు పొందడంతో పాటు పూర్తి స్థాయి హెల్త్‌ రికార్డులను నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు డాక్టర్లు పాల్గొన్నారు.