నెల్లూరు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నవశకం సర్వే కార్యక్రమంలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి అర్హులైన వారిని గుర్తించాలని ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త డాక్టర్ నాగార్జున ఒక ప్రకటనలో తెలిపారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్నవారు అర్హులన్నారు. 12 ఎకరాల్లోపు మాగాణి, 35 ఎకరాల లోపు మెట్ట, మాగాణి, మెట్ట కలిపి 35 ఎకరాలు ఉన్నవారు అర్హులని తెలిపారు. ఇంటింటి సర్వేకు వచ్చే వాలంటీర్లకు పక్కాగా వివరాలు తెలియజేయాలన్నారు.