విద్యార్థి వైద్యానికి రూ.4లక్షల ఎల్‌వోసీ


గజ్వేల్: పేదింటిలో పుట్టి కష్టపడి ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థి అనుకోకుండా అనారోగ్యానికి గురయ్యాడు. విషయాన్ని తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు వైద్యం కోసం సీఎం సహాయనిధి నుంచి రూ.4 లక్షలు మంజూరు చేయించారు. వివరాల్లోకి వెళ్తే గజ్వేల్ మండలం బెజుగామ గ్రామానికి చెందిన రాందాస్‌గౌడ్, సుభాషిణి దంపతుల కుమారుడు కార్తిక్ బెంగుళూరులోని ఐఐటీఎస్ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్)లో చదువుతున్నాడు. మొదటి నుంచి కార్తిక్ చదువుల్లో ప్రతిభ కనబరుస్తూ వచ్చాడు.

టీఎస్ ఎంసెట్‌లో 73వ ర్యాంకు రాగా, కేవీపీవైలో ఇండియాలో 7వ ర్యాంకు వచ్చింది. జేఈఈ మెయిన్స్‌లో ఓబీసీ 10వ ర్యాంకు రాగా ఆల్‌ఇండియాలో వ ర్యాంక్ వచ్చింది. జేఈఈ అడ్వాన్స్‌లో ఓబీసీ 2వ ర్యాంక్ రాగా ఆల్‌ఇండియాలో 270 ర్యాంక్ వచ్చింది. రీసెర్చ్‌పై మొదటి నుంచి ఉత్సాహం చూపించిన కార్తిక్ బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో చేరాడు. ఇటీవల చదువుతుండగానే అనారోగ్యానికి గురవగా హైదరాబాద్‌లోని అపోలో ఆసుపవూతిలో పరీక్షలు నిర్వహించగా వైద్యానికి పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.4 లక్షల ఎల్‌వోసీని బుధవారం కార్తీక్ తండ్రి రాందాస్‌కు అందించారు. కార్తిక్ త్వరగా కోలుకోవాలని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. పేదల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఎంతో మందిని ఆదుకోవడం జరిగిందన్నారు. కార్యక్షికమంలో టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బెండ మధు, మాదాసు శ్రీనివాస్, లక్ష్మణ్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.



13