గ్రామదర్శినితో పనితీరు మెరుగు : డీఎంహెచ్‌ఓ

కట్టంగూర్ : గ్రామదర్శిని కార్యక్షికమంతో అధికారుల పని తీరు మెరుగుపడుతుందని డీఎంహెచ్‌ఓ, మండల ప్రత్యేకాధికారి కొండల్‌రావు అన్నారు. గ్రామదర్శినిలో కార్యక్షికమంలో భాగంగా శుక్రవారం మండలంలోని కురుమర్తి గ్రామం లో అధికారులు, ప్రజావూపతినిధులతో కలిసి పర్యటించి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం, జడ్పీ ఉన్నత పాఠశాలను పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించాలని సిబ్బందికి సూచించారు. వసతిగృహ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు.

అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో జీవవైవిద్య కమిటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటి బీసీ హాస్టల్‌ను సందర్శించి పరిసరాలను, రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్షికమంలో ఎంపీపీ జెల్లా ముత్తి లింగ య్య, జడ్పీటీసీ తరాల బలరాములు, సర్పంచ్ గుర్రం సైదులు, ఎంపీటీసీ బీరెల్లి రాజ్యలక్ష్మివూపసాద్, ఎంపీడీఓ చింతపల్లి నరేందర్, తాసిల్దార్ హుస్సేన్, ఈఓపీఆర్‌డీ వసుంధర, వైద్యాధికారి నాగలక్ష్మి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ తిరుమల, ఏపీఓ గుంటుక వెంక ఏపీఎం చౌగోని వినోద, బీసీ మాస్టల్ వార్డెన్ అద్దంకి సంజీవ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.