హైదరాబాద్ : పబ్లిక్‌గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మోకాళ్ల సమస్యలపై డిసెంబర్ 1న అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహుకులు తెలిపారు. పబ్లిక్ గార్డెన్స్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఆదివారం ఉదయం 7 గంటల కు మోకాళ్ల నొప్పులు, వాటి నివారణ అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అపోలో ఆస్ప త్రి ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ బాలావర్ధన్‌రెడ్డి మోకాళ్ల నొప్పులు, చికిత్సలు, జాగ్త్రతలపై వివరిస్తారన్నారు.