కీసర: పురిటి నొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణికి 108 సిబ్బంది సుఖ ప్రసవం చేశారు. శుక్రవారం కీసరలోని శివాజీనగర్‌కు చెందిన వేముల లక్ష్మికి గురువారం అర్ధరాత్రి పురిటి నొప్పులు రావడంతో కుటుంబీకులు 108కు సమాచారం ఇచ్చారు. సిబ్బంది పరీక్షించి అత్యవసర చికిత్స చేశారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఈఎంటీ చిత్రం రవి వెంటనే కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసి అక్కడి వైద్యుల సూచనల మేరకు చికిత్స చేశారు. లక్ష్మికి సుఖప్రసవం జరిగి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. తదుపరి వైద్య చికిత్స కోసం కీసరలోని ప్రభుత్వ ప్రాథమిక ఆస్పత్రికి తరలించారు.