జడ్చర్లటౌన్ : 108 వాహనాల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని జీవీకే గ్రూప్స్ చీఫ్ ఆపరేటింగ్ అధికారి బ్రహ్మానందరావు చెప్పారు. గురువారం జడ్చర్లలో 108 సేవలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవీకే సౌజన్యంతో కొనసాగుతున్న 108, 104, 1962 సేవలను మరింత విస్తరింపజేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు అన్ని ప్రాంతాల్లో 108, 104 వాహనాల సేవలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. ఈ సందర్భంగా 108, 104 సేవలు, పని తీరుపై సమీక్షించారు. 108 వాహనంలో సదుపాయాలు, పని తీరు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ ఖాలీద్, ప్రోగ్రాం మేనేజర్ నసీరొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.