కంటివెలుగు కళ్లద్దాలు సరఫరా చేయాలి

వివరాలు తెలుసుకుంటున్న డా.శ్రీనివాస సాగర్‌


నల్గొండ (ఆరోగ్యజ్యోతి): జిల్లాలో కంటివెలుగు పథకం ద్వారా పరీక్షలు చేయించుకున్న ప్రతి ఒక్కరికి కళ్లద్దాలు అందేలా చూడాలని కంటివెలుగు ప్రోగ్రాం రాష్ట్ర అధికారి డా. శ్రీనివాస సాగర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని అంధత్వ నివారణాధికారి కార్యాలయంలో శుక్రవారం వైద్యులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో జరిగిన కంటివెలుగు పథకం వివరాలు అడిగి తెలుసుకున్నారు. శస్త్రచికిత్సలు చేయాల్సినవారిని గుర్తించి వెంటనే శస్త్రచికిత్సలు జరిగేలా చూడాలని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కార్యక్రమంలో ఎలాంటి ఇబ్భందులు లేకుండా చూడాలన్నారు. జిల్లా అంధత్వనివారణ అధికారి డా.ఏసీహెచ్‌ పుల్లారావు, డా.సాంబశివారెడ్డి, జితేంద్ర, ప్రకాష్‌, ఇతర సిబ్భంది పాల్గొన్నారు.