ప్రభుత్వ దవాఖానలో ఐటీడీఏ పీవో సతీమణి ప్రసవం

 


భద్రాచలం, (ఆరోగ్యజ్యోతి): భద్రాచలం ప్రభుత్వ దవాఖానలో సోమవారం ఐటీడీఏ పీవో గౌతమ్‌ సతీమణి గౌతమి ప్రసవించారు. గౌతమి గర్భిణిగా కొన్ని నెలల నుంచి భద్రాచలం ప్రభుత్వ దవాఖానలోనే వైద్యసేవలు పొందుతున్నారు. నెలలు నిండటంతో సోమవారం ఆమె దవాఖానలో చేరగా.. వైద్యాధికారులు ఆమెకు సుఖప్రసవం చేశారు. గౌతమి పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవోకు పలువురు అభినందనలు తెలిపారు.