మంచి ఆహారంతోనే ఆరోగ్యం

హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి): మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుందని న్యూట్రిషనిస్ట్‌ శ్రీదేవి జాస్తి సూచించారు. ఫిక్కీ లేడిస్‌ ఆర్గనైజేషన్‌ (ఫ్లో) సంస్థ ఆధ్వర్యంలో సోమాజిగూడలోని హోటల్‌ ది పార్కులో బుధవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమెతో పాటు ఇతర నిపుణులు డా.రేణుక, డా.మంజుల అనగాని మాట్లాడారు. సహజసిద్ధమైన సంప్రదాయ ఆహారం ఎలా తీసుకోవాలి,  స్మూతీస్‌ను, కొబ్బరి పాలతో చేసే కొత్త రకం వంటకాలు చేసి చూపారు. ఆహారం సమపాళ్లలో తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. ఫ్లో ఛైర్‌పర్సన్‌ సోనా చతుర్ని మాట్లాడుతూ ప్రతి గృహిణి తన ఆరోగ్యాన్ని ఎలాంటి ఆహారం ద్వారా కాపాడుకోవాలో సూచించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.