నిజామాబాద్ (ఆరోగ్యజ్యోతి): నగరంలో పెరుగుతున్న డెంగీ వ్యాధి పరిస్థితి తెలుసుకునేందుకు మంగళవారం నుంచి వారం రోజుల పాటు ఇంటింటి సర్వే చేయాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి సుదర్శనం సూచించారు. సోమవారం రాత్రి యూపీహెచ్‌సీ సిబ్బందితో సమావేశమై వారం రోజుల పాటు చేయాల్సిన కార్యక్రమాలను వివరించారు. ప్రతి ఇంటికి వెళ్లి డెంగీ జ్వరాలతో బాధపడుతున్నవారి వివరాలు సేకరించాలన్నారు.