-40 దవాఖానల్లో 268 డయాలసిస్ మిషన్లు
-ఏడాదిలో 28,275 మందికి సేవలు
హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి): కేంద్రాలను ఏర్పాటుచేసింది. వేలమంది కిడ్నీ వ్యాధిగ్రస్థులు ఈ కేంద్రాల్లో సేవలు పొందుతున్నరు. మూత్రపిండ సమస్యలున్నవారికి వారానికి రెండు, మూడుసార్లు డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటివారికి ఉమ్మడి ఏపీలో కేవలం ఒకట్రెండు డయాలసిస్ కేంద్రాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడా పరిస్థితి లేకుండా బాధితులకు ప్రభుత్వం సమీపంలోని దవాఖానల్లోనే ఉచితంగా డయాలసిస్ సేవలందించి దూరప్రాంతాలకు వెళ్లే అవస్థ నుంచి తప్పిస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలోని 40 సర్కారు దవాఖానల్లో 268 డయాలసిస్ మిషన్లను ఉన్నాయి. వీటిద్వారా ఏడాదిలో 28,275 మందికి సింగిల్ యూజ్డ్ డయాలసిస్ సేవలందిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం సర్కారు దవానల్లోని డయాలసిస్ కేంద్రాల్లో సింగిల్ యూజ్జ్ డయాలసిస్ యూనిట్లను ఏర్పాటుచేసింది. పీపీపీ పద్ధతిన ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటుచేసిన ఈ డయాలసిస్ కేంద్రాలకు అవసరమైన నీరు, విద్యుత్, రూము వంటి వసతులను ప్రభుత్వం కల్పించింది. ఇందుకు అధికమొత్తంలో నిధులు ఖర్చవుతున్నప్పటికీ నాణ్యమైన వైద్యసేవలను అందించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. సింగిల్ యూజ్డ్ ఫిల్టర్ పద్ధతి వల్ల రోగులు సురక్షితంగా ఉండగలుగుతారు. వారికి ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌లు రావు.