- రాజన్న సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో యాంటిబయోటిక్, నొప్పుల మందులు కరువు
- మందుల సరఫరాకు ముందుకు రాని సరఫరాదారులు
సిరిసిల్ల,ఆరోగ్యజ్యోతి: జిల్లా ప్రధాన ఆసుపత్రికి మందుల కొరతతో ఎమర్జెన్సీ వచ్చింది. జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చిన రోగులకు అత్యవసర మందులు లేక ప్యారసిటమాల్ గోలీలతోనే సరిపెడుతున్నారు. ఆసుపత్రిలో చేరిన రోగులకు పాతకాలపు యాంటీ బయోటిక్ గోలీలు ఇస్తూ చికిత్సలు చేస్తున్నారు. మందుల కొనుగోలుకు టెండర్లు పిలిచినా సరఫరాదా రులు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో మరోసారి టెండర్లు ఆహ్వానిస్తు న్నారు.
ప్రభుత్వాసుపత్రులకు రోగుల తాకిడి
ఇప్పటికే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులకు జ్వరాల తాకిడితో వస్తున్న రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వారికి సరైన వైద్యం అందించలేక వైద్యులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా ప్రధాన ఆసుపత్రికి నిత్యం 800 మందికి పైగా రోగులు వస్తున్నారు. అందులో జ్వర పీడితులే అధికంగా ఉంటున్నారు. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు ఉన్నారు. వీరికి అందించడానికి యాంటిబయోటిక్, కాల్షియం, అజీర్తి, నొప్పుల మాత్రలు ఆసుపత్రిలో లేకపోవడంతో కేవలం పారిసిటామాల్ మాత్రలు మాత్రమే ఇచ్చి పంపిస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న మాత్రలు కూడా నాసిరకంగా ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రోగులకు ఇస్తున్న బీ కాంప్లెక్స్ మాత్రలు పౌడర్‌గా మారిపోతున్నాయి. వాటిని రోగులకు వేసుకోకుండా తిరిగి ఇస్తూ గొడవ చేస్తున్నారని సిబ్బంది తెలి పారు. మరోవైపు అత్యవసర మందుల కోసం 15 రోజులుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. దీంతో ఆసు పత్రికి వచ్చే రోగులకు రోగాలు తగ్గక చివరకు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వదలని జ్వరాలు
జిల్లాలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వైరల్ జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జ్వరా లు తగ్గకపోవడంతో బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలో ఇప్పటికే విషజ్వరాలతో పదిమందికిపైగా మూడు నెలల్లో మృతిచెందారు. డెంగ్యూ జ్వరాలు జిల్లాను భయపెడుతున్నాయి. ఈ ఏడాది సీజన్‌లో 35 డెం గ్యూ కేసులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోద య్యాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో డెంగ్యూ లక్షణా లతో చికిత్స పొందుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 3 నెలల్లోనే 7704 మంది జ్వరంతో బాధపడుతూ చికిత్స పొందిన వా రు ఉన్నారు. ఇందులో డెంగ్యూ లక్షణాలతోనే ఎక్కు వగా బాధపడుతున్నారు. జ్వరాలకు సంబంధించి జిల్లాలో 255 గ్రామ పంచాయతీల్లో 53 హై రిస్క్ గ్రామాలుగా గుర్తించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు 165 వైద్య శిబిరాలను నిర్వహించారు. వీటిలో సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లోనే 20 డెంగ్యూ కేసులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నమోద య్యాయి. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో 14 హైరిస్క్ ప్రాంతాలను గుర్తించారు. సిరిసిల్లలో బోయవాడ, వెంకట్రావునగర్, విద్యానగర్, బీవైనగర్, అశోక్‌నగర్, సుభాష్‌నగర్ వేములవాడ మున్సిపాలి టీ పరిధిలో భగవంత్‌రావు నగర్, సుబ్రమ్మణ్యనగర్, సుభాష్‌నగర్, శివనగర్, విద్యానగర్, భవానీ నగర్, బద్దిపోచమ్మ వీధి, అంబేద్కర్ నగర్‌లలో వైద్య సేవలు అందించారు. మూడు నెలల్లోనే జ్వర పీడి తుల సంఖ్య పెరుగుతోంది. ఆగస్టులో 2013 మంది, సెప్టెంబరులో 3,854 మంది, అక్టోబరు 1,837 మంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే జ్వరంతో బాధపడు తూ చికిత్సలు పొందారు. సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో 2వేల మంది వరకు ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, మంచాల కొరతతో రోగులు ఇబ్బందులు పడుతూ ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్ర యిస్తున్నారు. వేలాది రూపాయలు ప్రైౖవేటు ఆసు పత్రుల్లో ఖర్చు చేయలేక ఇబ్బందులు పడు తు న్నారు. మరోవైపు వైరల్ జ్వరాలతో పేట్‌లెట్స్ తగ్గి పోయిన వారు డెంగ్యూ భయంతో కరీంనగర్, హైదరాబాద్‌కు పరుగులు తీస్తున్నారు. పేట్‌లెట్స్ తగ్గిపోయాయని.. దాదాపు 2 లక్షల వరకు ఖర్చు చేసిన వారు ఉన్నారు.
దోమలతో జ్వరాలు
జిల్లాలో దోమలు పెరిగిపోవడంతో జ్వరాలు కూడా విజృంభిస్తున్నాయి. దోమల నియంత్రణ లేక పోవడంతో జ్వరాలు పెరిగిపోతున్నట్లుగా తెలుస్తుం ది. ముఖ్యంగా పగలు కుట్టే టైగర్ దోమలు ప్రమాదకరమైనవని ప్రచారం చేస్తున్నారు. దోమలు మాత్రం నివారించలేకపోతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లోకి వచ్చిన స్ర్పేలు, లిక్విడ్‌లు దోమలను నివారించలేకపోతున్నాయి. మరోవైపు దోమకాటుతో చలిజ్వరాల బారిన పడుతున్నారు.
మందుల వస్తాయి..
- డాక్టర్ తిరుపతి, సూపరింటెండెంట్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి
మందుల కోసం ఇండెంట్ పెట్టాం. కొన్ని రకాల మందుల కొరత ఉంది. మందులు త్వరలో వస్తాయి. స్థానికంగా మందులు కొనడానికి టెండర్లు కూడా పిలిచాం.