మహిళా సైకాలజిస్ట్స్ అసోసియేషన్ విజయవాడ నగర అధ్యక్షురాలిగా అనితాజ్యోతి
విజయవాడ, (ఆరోగ్యజ్యోతి): మహిళల మానసిక సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మహిళా సైకాలజిస్ట్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షురాలు మండలి శ్రావణి కృష్ణకుమారి పేర్కొన్నారు. ఆదివారం గవర్నర్‌పేటలోని ఓ హోటల్‌లో కౌన్సెలింగ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా సైకాలజిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర మహిళా విభాగం, విజయవాడ నగర విభాగాలను కొత్తగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రావణి కృష్ణకుమారి మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పడిన కార్యవర్గం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి, మహిళల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారని తెలిపారు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ టి.ఎస్.రావు నూతన కార్యవర్గాలను ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షురాలిగా మండలి శ్రావణి కృష్ణకుమారి, కార్యదర్శిగా డాక్టర్ మణీ రమణి, ఉపాధ్యక్షులుగా డాక్టర్ టి.కృష్ణకుమారి, డాక్టర్ ఐతరాజు స్రవంతి, సహాయ కార్యదర్శులుగా కోడి సుధారాణి, జి.లక్ష్మి, విజయలక్ష్మి, గౌరవ అధ్యక్షురాలిగా డాక్టర్ గాలి పుష్పలత, వర్కింగ్ కమిటీ సభ్యులుగా కళ్యాణి దేవిరెడ్డి, దాక్షాయణి, లక్ష్మి కాండ్రులను నియమించారు.
విజయవాడ శాఖ నూతన కార్యవర్గం
ఆంధ్రప్రదేశ్ మహిళా సైకాలజిస్ట్స్ అసోసియేషన్ విజయవాడ నగర అధ్యక్షురాలిగా అనితాజ్యోతి, కార్యదర్శిగా కళ్యాణి దేవిరెడ్డి, ఉపాధ్యక్షులుగా కస్తూరి, దాక్షాయణి, కాండ్రు లక్ష్మి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా నీరజ, స్వరూప, గిరీషాజైన్, వర్కింగ్ కమిటీ సభ్యులుగా పల్లవి, ప్రజా సంబంధాల అధికారిగా జ్యోతిలను నియమించారు. కార్యక్రమంలో గర్రె శంకరరావు, కిలారు శ్రీనివాస్, శ్రీపతి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.