డీఎమ్‌హెచ్‌వో ఆకస్మిక తనిఖీ

మోటకొండూరులో వైద్య సిబ్బందితో మాట్లాడుతున్న డీఎమ్‌హెచ్‌వో జయలక్ష్మి



యదాద్రి, మోటకొండూర్‌,(ఆరోగ్యజ్యోతి): మండలం కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం యాదాద్రి భువనగిరి డీఎమ్‌హెచ్‌వో జయలక్ష్మి ఆకస్మిక తనిఖీ చేసి, దస్త్రాలను పరిశీలించారు. సీజనల్‌ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టాలని వైద్య సిబ్బందికి సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. ఆసుపత్రిలో వసతులపై పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మండల వైద్యాధికారి రాజేందర్‌నాయక్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.