ఆరోగ్య తెలంగాణే లక్ష్యం


 




గోదావరిఖని, (ఆరోగ్యజ్యోతి):  ఆరోగ్య తె లంగాణే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నారని రామగుండం ఎమ్మె ల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలకుర్తి, రామగుండం మండలాలకు చెందిన 18 మంది సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులు అందజేసి, మాట్లాడారు. అనారోగ్యానికి గురై చికిత్స చేయించుకోలేని నిరుపేదలకు వరంగా సీఎంఆర్‌ఎఫ్ వరంగా మారిందన్నారు. ఈ క్రమంలోనే రెండు మండలాలకు చెందిన 18 మంది లబ్ధిదారులకు 3,86, 500 చెక్కులను అందజేసినట్లు పేర్కొన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నా రని వివరించా రు. పేద ప్రజలకు ఆసరా పెన్షన్లతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు దిగ్విజయంగా అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.