రొమ్ము క్యాన్సర్ పైఅవగాహన

విజయవాడ,(ఆరోగ్యజ్యోతి): భారత్ లో ఏటా లక్షమందిలో 55 మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారని విశాఖ మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆస్పత్రి చీఫ్ మెడికల్ అంకాలజిస్ట్‌ డాక్టర్ బోయ రాకేష్ రెడ్డి అన్నారు. విశాఖ వైజాగ్ జర్నలిస్ట్స్‌ఫోరం ప్రెస్ క్లబ్ లో రొమ్ము క్యాన్సర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్లోబోకాన్ 2018 గణాంకాల ప్రకారం ప్రపంచంలోనే రోమ్ము క్యాన్సర్ ను రెండో పెద్ద క్యాన్సర్ గా గుర్తించారని వివరించారు. 2018-19 సంవత్సరంలో 20 లక్షల నూతన రొమ్ము క్యాన్సర్ కేసులను గుర్తించినట్టు అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. తాము రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తుంటామని రాకేష్ రెడ్డి తెలిపారు.