అమరావతి(ఆరోగ్యజ్యోతి): ఏపీ ప్రజలు అధికంగా ఉండే పక్క రాష్ట్రాలలోని ముఖ్య నగరాలలో కూడా ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తూ ఏపీ ప్రభుత్వులు జారీచేసింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో సూపర్ స్పెషాలిటీ సేవలు పొందేలా ఆరోగ్యశ్రీని వర్తింపజేసిస్తూ వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలిచ్చింది. ఎంప్యానల్ చేసిన ఆసుపత్రులలో ఈ సేవలు అందుబాటులో ఉండనుండగా 17 అంశాలలో 716 చికిత్సలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం చేయించుకొనేలా ఆదేశాలిచ్చారు. అవయవమార్పిడి, న్యూరో సర్జన్, నెఫ్రాలజీ అంశాలలో కూడా చికిత్సకు అవకాశం కల్పించారు.