మధు, తులసిరెడ్డి డిమాండ్
విజయవాడ,(ఆరోగ్యజ్యోతి): వైద్య, ఆరోగ్య శాఖలో పని చేస్తున్న 670 మంది ఆయుష్ ఒప్పంద పారా మెడికల్ ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో మాట్లాడారు. అధికారంలోకి రాగానే ఆయుష్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకుంటామని పాదయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.డి.కృష్ణ, ప్రధాన కార్యదర్శి పి.సురేష్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.