ఖానాపూర్, నిర్మల్(ఆరోగ్యజ్యోతి): ఖానాపూర్ ప్రభుత్వాసుపత్రిని గురువారం స్థానిక ఎంపీపీ అబ్దుల్ మోయి ద్ ఆకస్మీకంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భం గా ఆసుపత్రిలో రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆ రా తీశారు. కనీసం ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్‌లకు బె డ్‌షీట్‌లు ఇవ్వకకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆసుపత్రిలో పలు రికార్డులను పరిశీలించి న ఆయన కొంతమంది సిబ్బంది ముందస్తుగా హాజ రు వేసుకుంటున్నారని, ఇలా ఎందుకు జరుగుతోంద ని సూపరింటెండెంట్ వంశీమాదవ్‌ను ప్రశ్నించగా తా ను కూడా గమనించలేదని బదులివ్వడంతో ఎంపీపీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో విలేఖరులతో మాట్లాడుతూ ఆసుపత్రిలో సరిపడా వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో ఆసుపత్రి కి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎ ంపీపీ మోయిద్ అన్నారు.
శానిటేషన్ పనులు సరిగా జరుగడం లేదని, ఆసుపత్రి లోపల చెత్త చెదారం పే రుకుపోవడంతో పాటు ఆసుపత్రి ఆవరణలో సైతం అపరిశుభ్రవాతవరణం ఉందన్నారు. ఈ విషయాలన్నింటిని తాను జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకెళ్తానన్నా రు. ఆయనవెంట ఖానాపూర్ వైస్ ఎంపీపీ గుగ్లావత్ వాల్‌సింగ్, ఖానాపూర్ పీఏసిఎస్ మాజీ చైర్మన్ ఆ కుల వెంకాగౌడ్, మస్కాపూర్ సర్పంచ్ అడిదెల మ హేందర్, రాజునాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకు లు జంగిలి శంకర్, దాసరిగొండ మల్లయ్య, కొక్కుల ప్రదీప్, ఖానాపూర్ మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు తోట సత్యం, మాజీ ఎంపిటీసి పరంకూశం శ్రీనివాస్, నాయకులు రవి తదితరులున్నారు.