సీఎం, పీఎంలకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖలు
హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి): క్యాన్సర్‌ను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఇందుకయ్యే ఖర్చులో సగం కేంద్ర ప్రభుత్వం భరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ఆయన బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖలు రాశారు.