హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): ప్రకృతి వైద్యం భారతదేశ సంపద అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బేగంపేటలోని హరిత ప్లాజాలో శాంతగిరి ఆయుర్వేద చికిత్సా కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నయం కాని రోగాలను కూడా ఆయుర్వేద వైద్యం నయం చేసిందని చెప్పారు. ప్రసిద్ధి చెందిన ఈ ఆయుర్వేద వైద్యానికి ఇతర దేశాలు కూడా ఎంతో ప్రాధాన్యం ఇస్తుండటం గర్వంగా ఉందని చెప్పారు. త్వరలోనే అందరికీ ఈ ఆయుర్వేద వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.