-మహబూబ్‌నగర్ అర్బన్ సీడీపవో వసీం సుల్తానా
మహబూబ్‌నగర్, (ఆరోగ్యజ్యోతి): అందరి ఆరోగ్యం కోసం ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ వారికి అసవరమైన సూచనలు, సలహాలు అందించాలని మహబూబ్‌నగర్ అర్బన్ సీడీపీవో, కార్యాలయ సూపర్‌వైజర్ వసీం సుల్తానా అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రవీంద్రనగర్‌లో జాతీయ ఆరోగ్య మిషన్ (ఢిల్లీ టీం) సభ్యులు ఇంటింటిని సందర్శించి కుటుంబ సర్వే చేశారు. ఈ క్రమంలో రవీంద్రనగర్‌లోని పలు కుటుంబాల సభ్యులకు బీపీ, బరువు, హెచ్‌పీ, తదితర పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంగన్‌వాడీ టీచర్లు మరింత బాధ్యతగా తమ పరిధిలోని అందరికీ మేలు చేకూరేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో నేషనల్ హెల్త్ టీం సభ్యులు, హెల్త్ సూపర్‌వైజర్ జయలత, భీమమ్మ, అంగన్‌వాడీ టీచర్లు క్రిష్ణవేణి, సునిత, నీలమ్మ తదితరులు పాల్గొన్నారు.