కొత్తగూడె,(ఆరోగ్యజ్యోతి): అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ రామవరం నందు స్టాఫ్ నర్స్ గా విధులు నిర్వహిస్తూ ఇటీవల ఆకాలమరణం చెందిన కొమ్ము సురేఖ కుటుంబానికి,అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పాత కొత్తగూడెం సిబ్బంది,సురేఖ భర్త కొమ్ము సురేష్ కు ఐదువేల రూపాయలు ఆర్థిక సహాయం అందించినారు., సురేఖ మరణం మాకు తీరనిలోటని కార్యక్రమంలో వైద్యాధికారిని డాక్టర్ నిస్సి శారోన్, కమ్యూనిటీ ఆర్గనైజర్ పొన్నెకంటి సంజీవరావు అన్నారు. సురేఖ విధినిర్వహణలో క్రమశిక్షణతో పని చేసే దన్ని,ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ లు జయంతి,లలిత,ఎ. ఎన్.ఎం,లు,కమల,అరుణ, ఉమాదేవి,ల్యాబ్ టెక్నిషియన్ నాగమణి,ఆరోగ్యమిత్ర విజయలక్ష్మి,ఆంజనేయులు, మసూదా బేగం,తదితరులు పాల్గొన్నారు.