ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని
న్యూరో, కార్డియాక్ హెల్త్ షోకి స్పందన
ఎనికేపాడు, విజయవాడ ,(ఆరోగ్యజ్యోతి): ఆరోగ్య రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేస్తున్నారని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని) అన్నారు. ఎనికేపాడులోని అను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరో, కార్డియాక్ సైన్సెస్ ప్రథమ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అను ఇన్‌స్టిట్యూట్ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన హెల్త్‌షో, రక్తదాన శిబిరాలను ప్రారంభించారు. ఆళ్ల నాని మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలనే లక్ష్యంతో వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నామన్నారు. అను ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన 'బీ ఏ సేవియర్ -బీ ఏ హీరో' కార్యక్రమంలో భాగంగా అత్యవసర చికిత్స విధానాలపై శిక్షణ పొందిన అభ్యర్థులకు మంత్రులు సర్టిఫికెట్లు అందజేశారు. ఆస్పత్రి వార్షికోత్సవం సందర్భంగా ఉచిత కన్సల్టేషన్‌తో పాటు సీటీ, ఎంఆర్‌ఐ స్కాన్‌లపై 50 శాతం రాయితీ అందిస్తున్నామని ఎండీ జి.రమేష్ తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ నవీన్, అనిల్‌కుమార్, డాక్టర్ బాలాజి, డాక్టర్ ఎన్.అనిల్‌కుమార్, డాక్టర్ జి.శ్రీదేవి, డాక్టర్ కిరణ్‌కుమార్, డాక్టర్ కె.దుర్గా నాగరాజు, డాక్టర్ వరప్రసాద్ పాల్గొన్నారు.