వైద్యుల సమస్యల పరిష్కారం కోసం కృషి

 


సుల్తాన్‌బజార్,హైదరాబాద్, (ఆరోగ్య్జ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యశాలల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీ జీడీఏ) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పుట్ట శ్రీనివాస్,కార్యదర్శి డాక్టర్ రవిశంకర్‌లు పేర్కొ న్నా రు. బుధవారం కోఠిలోని డీఎంఈ కార్యాలయంలో తెలంగాణ వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేశ్‌రెడ్డిని వారు వైద్యులతో కలుసుకొని తెలంగాణ వైద్య విధాన పరిషత్ ప్రభుత్వ వైద్యుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళుగా పెండింగ్‌లో ఉన్న పదోన్నత్తుల సమస్య లను పరిష్కరించాలని కోరారు. అంతే కాకుండా డీఎంఈ పరిధిలోని సీఏఎస్,పీఆర్‌సీలను తక్షణమే అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ విషయమై స్పందించిన డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి అతి త్వరలోనే సీఏఎస్‌ను అమలు పరించేందుకు కృషి చేస్తానన్నారు.పీఆర్‌సీ తమ పరిధిలోనిది కాదని,ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ దృష్టికి తీసుకువెళ్ళి సమస్యను పరిష్కరించే విధంగా చూస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నా రు.