ఓంకార్ కు సహాయం

ఓంకార్ కు సహాయం


5 వేల రూపాయల ఆర్థిక సహాయం 



ఆదిలాబాద్, నేరడిగొండ (ఆరోగ్యజ్యోతి) :సికిల్ సెల్ వ్యాధి ద్వారా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం తో న్యూరో సర్జరీ చేయించుకున్న బాలుడు ఓంకార్ కుటుంబానికి వైద్య ఉద్యోగులు ఆధ్వర్యంలో ఓంకార్ తల్లిదండ్రులకు5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆదివారం  నాడు అందించారు. వివరాల్లోకి వెళితే నేరడిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరదిలోని తేజాపూర్ సబ్ సెంటర్ లో రెండవ ఆరోగ్య కార్యకర్త గా పనిచేస్తున్న రాణి తన  కుమారుడు  ఓంకార్ (12)కు గత కొంతకాలంగా సికిల్ సెల్ అనీమియా వ్యాధి తో బాధపడుతున్నారు. ఇటీవల నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) హైదరాబాద్ లో ఓంకారం చేర్పించి క్రినియల్  సర్జరీ చేయించారు. ఈ సర్జరీకి సుమారు ఆరు లక్షల రూపాయలకు పైగా ఖర్చు అవ్వడం జరిగింది. వైద్య ఉద్యోగుల ఆధ్వర్యంలో5 వేల రూపాయలను సహాయాన్ని అది వారం రాణి కి  అందించారు.