కొత్తగూడెం (ఆరోగ్యజ్యోతి): డెంగీ, మలేరియా పాజిటీవ్ కేసులపై సత్వరం స్పందించాలని మలేరియా ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ ఎం.వెంకటేశ్వరరావు సిబ్బందికి సూచించారు. సబ్ యూనిట్ అధికారులు, టెక్నికల్ సూపర్‌వైజర్ల సమావేశం డీఎంహెచ్‌వో కార్యాలయంలో శనివారం ఏర్పాటైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి, రెండో విడత దోమల నివారణా మందు పిచికారి చేసేందుకు ఎన్నికైన గ్రామాల్లో మలేరియా పాజిటీవ్ కేసులు నమోదయితే ఆ గ్రామాల్లో తప్పనిసరిగా పోకల్ స్ప్రే చేయించాలన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ల్యాబ్‌లలో నమోదైన ప్రతి మలేరియా కేసుల వివరాలు సబ్ యూనిట్ అధికారులు, మలేరియా టెక్నికల్ సూపర్‌వైజర్స్ వద్ద ఉండాలన్నారు.