ఖమ్మం (ఆరోగ్యజ్యోతి): ఖమ్మం నగరంలోని శ్రీ అభయ ఆసుపత్రిలో బుధవారం అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. డాక్టర్ అభిషేక్ దొంతుల ఎంఎస్‌ఎంసీహెచ్ (గోల్డ్ మెడలిస్ట్) ఆధ్వర్యంలో ఓ మహిళ వెన్నుముఖకు ఏర్పడిన గడ్డను ఆధునిక శస్త్ర చికిత్స ద్వారా సులభంగా తొలగించారు. ఈ సందర్భంగా డాక్టర్ అభిషేక్ మాట్లాడుతూ.. 20 రోజుల క్రితం కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన 30 సంవత్సరాల మహిళ విపరీతమైన నడుంనొప్పి, కాళ్ల నొప్పి, తమ్మిర్లతో బాధపడుతూ ఆభయ ఆసుపత్రిలో చేరిందన్నారు. ఆమెను పరీక్షించి, స్కానింగ్ నిర్వహించగా వెన్నుముఖకు గడ్డ అయినట్లుగా గుర్తించామని, ఆధునిక శస్త్ర చికిత్స ద్వారా ఆ గడ్డను సులభంగా తొలగించినట్లు తెలిపారు.
పేషెంట్ పరిస్థితి ఇప్పుడు ఆరోగ్యంగా ఉందన్నారు. ఇదే ఆపరేషన్‌కు హైదరాబాద్ నగరంలో భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చేదన్నారు. హైదరాబాద్ నగరానికి దీటుగా ఖమ్మం నగరంలో కూడా అతి తక్కువ ధరలకే అన్ని రకాల ఆరోగ్య సేవలు, శస్త్ర చికిత్సలు అభయ ఆసుపత్రిలో లభ్యమవుతున్నాయన్నారు. సమావేశంలో డాక్టర్ అభిషేక్ దొంతుల, ఆసుపత్రి సీఈవో డాక్టర్ కరీం, రవి, నరసింహారావు, గోపి పాల్గొన్నారు.