రక్తనిధి కేంద్రాల తనిఖీ

 


ఆదిలాబాద్‌ (ఆరోగ్యజ్యోతి): జిల్లా కేంద్రంలోని రక్తనిధి కేంద్రాలను క్షయ, కుష్టు నివారణ కార్యక్రమ అధికారి ఈశ్వర్‌రాజ్‌ మంగళవారం తనిఖీ చేశారు. రిమ్స్‌లోని రక్తనిధి కేంద్రం, శ్రీలక్ష్మీ(ప్రైవేటు) రక్తనిధి కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. దస్త్రాలను పరిశీలించారు. రిమ్స్‌ రక్తనిధి కేంద్రం పని తీరును వైద్యాధికారిణి అపర్ణను అడిగి తెలుసుకున్నారు. శ్రీలక్ష్మీ రక్తనిధి కేంద్రం కొన్ని రోజులుగా మూతబడి ఉన్నట్లు గుర్తించారు. మరో వారం రోజుల్లో పునఃప్రారంభించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఎయిడ్స్‌ నివారణ డీపీఎం సామ్‌సంగ్‌, సూర్యనారాయణ తదితరులు ఉన్నారు.