విషజ్వరాలపై తెదేపా ధర్నా


 


హైదరాబాద్‌(ఆరోగ్యజ్యోతి): రాష్ట్రంలో ప్రబలుతున్న విషజ్వరాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు కోఠీలోని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్రఅధ్యక్షుడు ఎల్‌.రమణ, పొలిట్‌ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ అదనపు సంచాలకులు సుధా  దేవిని కలిసి విష జ్వరాల నివారణకు చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ. జ్వరాలు విజృంభిస్తున్నా.. ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా సర్కారుకు పట్టడం లేదని  ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో  ఒకే పడకపై ఇద్దరు ముగ్గురు రోగులకు చికిత్స అందిస్తున్నారన్న ఆయన.. ఫలితంగా రోగులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.