నర్సాపూర్, (ఆరోగ్యజ్యోతి): సేవా భారతి సంస్థ ఆధ్వర్యంలో రూ.5కే మధ్యాహ్న భోజనం అందించడం అభినందనీయమని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రి పర్యవేక్షకుడు డాక్టర్ సురేశ్‌బాబు అన్నారు. నర్సాపూర్ ఆస్పత్రిలో సేవాభారతి ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం రోగులు, వారి సహాయకులకు మధ్యాహ్న భోజనం అందించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అయిదు రూపాయలకు టీ రాని రోజుల్లో పేదలకు ఆహారం అందించడాన్ని ప్రశంసించారు. ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా సంపర్క్ వనముల ఓంకార్ యాదవ్, భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్‌గౌడ్, భాజపా నియోజకవర్గ కన్వీనర్ గోడ రాజేందర్, నాయకులు రమణారావు, బుచ్చేశ్ యాదవ్, రమేశ్‌చారి, బాలరాజు, శ్రీధర్, బసప్ప పాల్గొన్నారు.