మెడికల్‌ పారిశుధ్య కార్మికుల వేతనం రూ.16 వేలు

 


అమరావతి,(ఆరోగ్యజ్యోతి) : ప్రభుత్వ ఆసుపత్రులు, టీచింగ్‌ కాలేజీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో (పీహెచ్‌సీ) పని చేసే పారిశుధ్య కార్మికులు, కంటింజెంట్‌ వర్కర్స్‌ వేతనాలను ప్రభుత్వం పెంచింది. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలకు మేరకు వారి వేతనాలను రూ.16 వేలకు పెంచుతూ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు వెలువరించారు. ఇది వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది.
జూనియర్‌ లాయర్లకు రూ.5 వేలు భత్యం
రాష్ట్రంలోని జూనియర్‌ న్యాయవాదులకు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించిన రూ.5 వేలు భత్యానికి (స్టైఫండ్‌) ప్రభుత్వం శనివారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు న్యాయశాఖ జీఓఎంఎస్‌ నంబరు 75ను విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు వెలువడేనాటికి మూడేళ్ల ముందు బార్‌ అసోసియేషన్‌లో ఎన్‌రోల్‌ అయిన వారికి నెలకు రూ.5 వేలు భత్యం చెల్లించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.