ఆయుష్షుని కాపాడి వృద్ధి చేసే వైద్యం ఆయుర్వేద 

 


- దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడంలో ఆయుర్వేద వైద్యం ఎంతో కీలకం


- చిట్కా వైద్యంపై అవగాహన


- జిల్లా ఆయుర్వేద వైద్య అధికారి డాక్టర్ ఫరీదా


తాంసీ, ఆదిలాబాద్ (ఆరోగ్యజ్యోతి): ఆయుర్వేద వైద్యంతో ఆయుష్షు వృద్ధి చేసుకోవచ్చని అలాగే దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడంలో ఆయుర్వేద వైద్యం ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా ఆయుర్వేద వైద్య అధికారి ఫరీదా తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నాలుగవ జాతీయ ఆయుర్వేద దినోత్సవం పురస్కరించుకొని ఆయుర్వేద వైద్యం, చిట్కా వైద్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయుర్వేద సూత్రాలను అవలంబించి నట్లయితే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని తెలిపారు. సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టాలని అలాగే యోగ అ కూడా చేయడం వల్ల ఆరోగ్యం పొందవచ్చన్నారు.పూర్వీకులు ఆరోగ్య సూత్రాలను పాటించడం  వల్ల సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని వారిని ఆదర్శంగా తీసుకున్నట్లయితే మనం కూడా ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు.వేకువ జమున నిద్ర లేచినట్లయితే  గాలిలో ప్రాణవాయువు శాతం అధికంగా ఉంటుందన్నారు. దీని ద్వారా రక్తపోటు మధుమేహం కొన్ని రకాల వ్యాధులను అదుపులో ఉంటాయి అని తెలిపారు .నిరోధక శక్తి వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రాణాయామం చేసి ఫలితాలు పొందుతున్నారు. చిట్కా వైద్యంపై అవగాహన కల్పించారు.మనకు కనిపిచే ఆకులూ, చెట్లు, బెరడు వాటిల్లో అనేక రకాల వ్యాదులు నయం చేసే ఔ శాదాలు ఎన్నో ఉన్నాయన్నారు.



 అనంతరం ఆయుర్వేద వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ నర్మద మాట్లాడుతూ అల్లోపతి లాగానే  ఆయుర్వేదంలో కూడా విభాగాలు ఉన్నాయి. అవి కాయ చికిత్స, బాల చికిత్స, గ్రహ చికిత్స, శలాక్యతంత్ర, శల్యతంత్ర, విషతంత్ర, రసాయన తంత్ర, వాజీకరణతంత్ర అనే విభాగాలు ఉన్నాయని తెలిపినారు. ఇదిభారతదేశంలో  అతి పురాతనకాలం నుండి వాడుకలో ఉన్న వైద్యం అని ఆమె తెలిపినారు.  ఆధునిక వైద్యం వచ్చిన తరువాత ఇది కొంచం వెనకబడినా ప్రస్తుతకాలంలో తిరిగి ప్రాచుర్యాన్ని సంతరించుకుందని పేర్కొన్నారు.  ఆధునిక వైద్యానికి లొంగని కొన్ని రకాలైన దీర్ఘకాలిక వ్యాధుల్ని, మొండి వ్యాధుల్ని సైతం నయం చేస్తాయని తెలిపినారు. ఈ కార్యక్రమంలో లో తాప్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వాణి.. డాక్టర్ పద్మ. సూపర్వైజర్ తులసీరామ్. ఫార్మసిస్ట్ మహేందర్. ఆరోగ్య కార్యకర్త సుగుణ తదితరులు పాల్గొన్నారు