శీతకాలం సమస్యల నుంచి ఉపశమనం కోసం ఈ పసిడిపాలు భలేగా ఉపయోగపడతాయి. దీనినే గోల్డెన్ మిల్క్ అని కూడా అంటారు. ఈ పాలతో ఉపయోగాలేంటో చూద్దాం..
శీతాకాలంలో వచ్చే జబ్బులను ఈ పసుపుపాలు కట్టడి చేస్తాయి. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. దగ్గు, జలుబు నుంచి ఉపశమనాన్నిస్తాయి. నెలసరి సమయంలో గ్లాసు పాలను తీసుకుంటే కడుపులో కలిగే నొప్పి, తిమ్మిరి నుంచి ఉపశమనం కలుగుతుంది. పసుపు పాలు సౌందర్యాన్ని పెంపొందించేందకు ఉపయోగపడతాయి.
చక్కెర కలపని ఒక గ్లాసు పాలలో చిన్నచెంచా పసుపు, చిన్న అల్లంముక్క, చెంచా తేనె, చిటికెడు మిరియాల పొడి వేసుకుని.. పాలు మరిగేస్తే గోల్డెన్ మిల్క్ సిద్ధం.●
చలికాలంలో వేధించే దగ్గు, జలుబు తగ్గుముఖం పడతాయి.
ఉదయాన్నే వేడి వేడి పసుపు పాలని తీసుకుంటే శ్వాసకోశ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.